ప్రజా నాయకుడు నాగం తిరుపతి రెడ్డి - NTR


నాగం తిరుపతి రెడ్డి గారి ప్రస్థానం

నాగం తిరుపతి రెడ్డి వనపర్తి జిల్లా, రెవెళ్ల మండలం, నాగపూర్ గ్రామానికి చెందిన వారు. 1974 వ సంవత్సరం డిసెంబర్ 24 న నాగం కృష్ణా రెడ్డి, సుభద్రమ్మ దంపతులకు అతి సామాన్య రైతు కుంటుంబం లో జన్మించారు. సొంతంగా వ్యాపారం చేయాలన్న ఆలోచన, తానే పదిమందికి జీవనోపాధి కల్పించాలన్న ఆశయంతో 1994  లో హైదరాబాద్ కు వలస వచ్చారు.
సామాన్య రైతు కుటుంబంలో జన్మించడం ప్రతి పేద మధ్యతరగతి వారి కష్టాలు తెలిసిన మనిషిగా వారికీ సొంత ఇంటి కల అందుబాటు దరలోకి తేవాలన్న ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. 1997 లో ఐశ్వర్య ఎస్టేట్స్ తో ప్రారంభమైన ప్రస్థానం, విజన్ ఇండియా తో కొనసాగుతూ "రేపటి ప్రపంచాన్ని ఈరోజే నిర్మిద్దాం" అన్న నినాదం తో ముందుకు సాగుతూ - శ్రీవనం, విజన్ ప్యారడైస్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన వెంచర్లతో కస్టమర్ల నమ్మకాన్ని పొంది విజయం దిశగా దూసుకెళ్తుంది.
"ఆశయం గొప్పదైతే ప్రతిఫలం గొప్పగా ఉంటుందని" నమ్మిన వ్యక్తి నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిరంతరం శ్రమించే వాన్ని చూసి ఓటమి భయపడుతుంది అన్న వివేకానంద సూక్తికి అసలైన నిదర్శనంగా నిలిచి ఎంతోమందికి  స్ఫూర్తి ప్రదాత అయ్యారు.
ఆయనకున్న సేవాగుణం అఖండం. మొదటినుండి తన సంపాదించిన దానిలో తనవంతుగా సమాజానికి ఎదో చేయాలన్నతపన గల వ్యక్తి. ఆ ఆలోచనతోనే నాగం తిరుపతి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించబడి 11000 మందికి పైగా నిస్సహాయులకు సాయం అందించారు. ఈ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థుల చదువుకు,  పిల్లల పుస్తకాలకు, పాఠశాల భవనాలకు ఎన్నో వసతులు కల్పించారు. అలానే పేదవాడి ఆకలి తెలిసిన మనిషిగా తన సంస్థలోని ఉద్యోగులకు ఉచిత భోజనం, అన్నదానాలు, వృద్దులకు ఫించన్లు, దేవాలయాల నిర్మాణానికి విరాళాలు అందించారు.
క్రీడలలో ఎంతో ప్రతిభ ఉంది సరైన ఆదరణ, ఆర్థిక వెసులుబాటు లేక వెనకబడిన యువతను చూసి రేపటి సమాజ నిర్మాతలు అయినా యువకులకు ప్రోత్సహం ఇవ్వాలని, క్రీడా పోటీలు నిర్వహించి వారికీ నగదు బహుమతులు, కిట్స్ అందించారు. సహాయం కోరి వెళ్లిన  వారికీ వెన్ను చూపని నైజం అతనిది.
తన సేవ భావంతో ఎంతోమంది అభిమానాన్ని చొరగొని NTR  గా ప్రసిద్ధిగాంచారు. ఆ అభిమానంతోనే నాగం తిరుపతి రెడ్డి యువసేన ఏర్పాటయింది.
అభిమానుల కోరిక మేరకు తన లక్ష్యం అయిన ప్రజాసేవ కొరకు రాజకీయాలలోకి రావాలని నిర్ణయించుకుని సెప్టెంబర్ 28 న కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన చేరిక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, విజయానికి కారణమవుతుందని పలువురు నాయకులు కొనియాడారు.
NTR గారికి YSR  అంటే ఎనలేని అభిమానం ఆయన చేసిన అభివృద్ధికి, ప్రవేశ పెట్టిన పథకాలకు ఆసక్తుడై తన బాటలో నడవాలనుకున్నారు. రాజకీయ రంగంలోకి రావాలన్న స్ఫూర్తి ఆయన నుండే వచ్చిందని ఎన్నో సార్లు చెప్పారు. ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సాయం అందించినా, ప్రతి నిత్యం ప్రజలతో మమేకమవ్వాలని వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేయాలన్న తపన అనునిత్యం చెలరేగుతూనే ఉంది. "ప్రజా సేవే లక్ష్యం, అభివృద్దే ద్యేయంగా" పనిచేసే వ్యక్తి. ఇలాంటి నాయకుడే నేటి సమాజానికి ఎంతో అవసరం. నిస్వార్థంగా ప్రజల సంక్షేమమే బాధ్యతగా భావించే నాయకుల చేతులలోనే దేశ భవిష్యత్తు ఉంది.



Comments

Popular posts from this blog

ప్రజల మనిషి, నిస్వార్థ నాయకుడు - నాగం తిరుపతి రెడ్డి

విజన్ ఇండియా నాగం తిరుపతి రెడ్డి ప్రస్థానం । వనపర్తి నియోజకవర్గం

అసలైన నాయకుడికి నిర్వచనం నాగం తిరుపతి రెడ్డి